Akhanda 2 Thaandavam Trailer Reaction | బాబోయ్ బాలయ్యా...వన్ మ్యాన్ ఆర్మీగా మారి యుద్ధం | ABP Desam

Continues below advertisement

 అఖండ భారత్...సనానతన హైందవ ధర్మ పరిక్షణ...ఈ రెండు నినాదాలే లక్ష్యంగా ఈసారి బాలయ్య అఖండ సీక్వెల్ అఖండ తాండవం ఉండబోతోంది. అదెలా అంటారా ఇదిగో ఈ రోజు రిలీజైన ట్రైలర్ లో ఫస్ట్ షాట్ చూడండి. పాకిస్థాన్, ఆఘ్గనిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, భూటాన్ లను కలిపేసి ఉన్న అఖండ భారత్ మ్యాప్ లు కనిపిస్తున్నాయి. కష్టం వస్తే దేవుడు వస్తాడు అనే నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. అలా నమ్మిన రోజు భారతదేశం తునాతునకలు అయిపోతుంది అంటూ డైలాగ్ తో ట్రైలర్ ను ఓపెన్ చేశారు. ఎవరో కొంత మంది భగవద్గీత చదువుతూ మన దేశ ప్రజలు పాటించే ధర్మాన్ని అర్థం చేసుకుని దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని అందుకు మహా కుంభమేళాను ఎంచుకున్నారని ట్రైలర్ లో ఈ షాట్స్ చూస్తే అర్థం అవుతోంది. ఇక శత్రు మూకలకు సహకరించే దుష్టశక్తి పాత్రలో ఆది పినిశెట్టి భయం గొలిపేలా ఉన్నారు. బట్ వన్స్ మన అఘోరా అఖండ బాబా స్టెప్ ఇన్ ఇన్...శత్రువులంతా గాల్లో స్పిన్నింగ్...అన్నట్లు ఉన్నాయి యాక్షన్ పార్ట్ షార్ట్స్ అన్నీ. ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా మీకు కనిపించేది ఓ మతం...కానీ మన దేశంలో కనిపించేది ఓ ధర్మం...సనాతన హైందవ ధర్మం అంటూ బాలా యాక్షన్ మొదలెట్టేశారు. దేశం జోలికొస్తే మీరు దండిస్తారు..దైవం జోలికొస్తే మేం ఖండిస్తాం..మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్ అంటూ తానొక్కడే శత్రుమూకల మీద ధర్మ యుద్ధాన్ని ప్రకటించారు అఖండ. త్రిశూలాన్ని గాల్లో తిప్పుతూ...మెషీన్ గన్ ని ఆపరేట్ చేస్తూ...బాబోయ్ బాలా మాస్ పీక్స్ అనే చెప్పాలి. ఇప్పటివరకూ ప్రపంచంలో నా దేశం రూపమే చూసి ఉంటావ్. మా దేశ విశ్వరూపాన్ని చూసుండవ్. మేమోసారి లేచి శబ్దం చేస్తే..ఈ ప్రపంచమే నిశ్శబ్దం అంటూ ఇచ్చిన క్లిఫ్ హ్యాంగర్ తో అఖండ తాండవం ఆయనేం చేయబోతున్నారో క్లియర్ పిక్చర్ ఇచ్చేశారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. త్రూ అవుట్ ట్రైలర్ మీ చెవులు వేరే వైపు దృష్టి మళ్లించకుండా చేసింది మాత్రమే మళ్లీ ఎస్ ఎస్ తమనే అని చెప్పాలి సారీ నందమూరి తమన్. డిసెంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవుతున్న అఖండ తాండవం2  మరోసారి థియేటర్లను పూనకాలతో దేవాలయాలుగా మార్చేస్తారేమో చూడాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola