Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
నటసింహం నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శీనుల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సినిమా అఖండ తాండవం. అఖండ సినిమాకు పార్ట్ 2 గా వస్తున్న ఈ సినిమాకు సంబంధించి గురువారం ప్రపంచవ్యాప్తంగా అనేక థియేటర్లలో ప్రీమియర్ షోస్ కు అనుమతులు ఉన్నాయి. అఖండ ఊపును బాలయ్య మళ్లీ చూపిస్తారని భావించిన అభిమానులు ప్రీమియర్ షోస్ బుక్ చేసుకోగా అనూహ్యంగా భారత్ లో ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ట్వీట్ చేసింది. సాంకేతిక కారణాలతోనే భారత్ లో ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే ఓవర్సీర్ లో షెడ్యూల్ ప్రకారమే ప్రీమియర్స్ ఉన్నాయంటూ ట్వీట్ ను మార్చి మళ్లీ ప్రచురించింది. అదే ట్వీట్ లో కొన్ని విషయాలు మన చేతిలో ఉండవని...ప్రీమియర్స్ వేయటానికి శతథా ప్రయత్నించామని కానీ కుదర్లేదని ట్వీట్ చేసింది. 14 రీల్స్ ప్లస్ సంస్థకు సంబంధించిన ఓ కేసు కోర్టులో ఉండంటతోనే భారత్ లో ప్రీమియర్స్ ఆగినట్లు మరో వాదన ఉంది. మరి చూడాలి రేపు భారత్ లో సినిమా రిలీజ్ అయినా అవుతుందా లేదా బాలయ్య అభిమానులకు ఊహించని షాక్ ఏమన్నా ఇస్తారా.