
Akash Puri Helps Pavala Shyamala | సీనియర్ నటి పావలా శ్యామలకు ఆకాశ్ పూరీ ఆర్థిక సాయం | ABP Desam
Continues below advertisement
సీనియర్ నటి పావలా శ్యామలాకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు యంగ్ హీరో ఆకాశ్ పూరీ ఆర్థిక సాయం చేశారు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఆంధ్రావాలా, గోలీమార్ సినిమాల ద్వారా పావలా శ్యామలా నటిగా పేరు సంపాదించారు. వృద్ధాప్యం మీద పడటం, పేదరికం కారణంగా ఆమె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సాయిదుర్గా తేజ్ లాంటి వాళ్లు పావలా శ్యామలకు ఆర్థిక సాయం చేశారు. ఇప్పుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ పావలా శ్యామలా వద్దకు వెళ్లి ఆమెను కలిసి మాట్లాడారు. కొంత డబ్బు సాయం చేయటంతో పాటు తన తల్లి లావణ్యతోనూ మాట్లాడించారు ఆకాశ్ పూరీ. పావలా శ్యామల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె అనారోగ్యం నుంచి కుదుటపడేంత వరకూ తను అండగా ఉంటానని పావలా శ్యామలా హామీ ఇచ్చాడు పూరీ జగన్నాథ్ తనయడు యంగ్ అండ్ డైనమిక్ హీరో ఆకాశ్ పూరీ.
Continues below advertisement