Ajith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP Desam

Continues below advertisement

తమిళ నటుడు అజిత్ ఘోర ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. రేసింగ్ అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న అజిత్, దుబాయ్ వేదికగా జరగనున్న దుబాయ్ 24 అవర్స్ రేస్ లో పాల్గొనడం కోసం అక్కడికి వెళ్లారు. ప్రాక్టీస్ సెషన్ లో ఆయన కారు అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ రేసింగ్ కోసం తన సొంత టీమ్‌ను ఏర్పాటు చేసిన అజిత్, ఆ టీమ్ లో ఓనర్, రేసర్ గా ఉన్నారు. ప్రాక్టీస్ సమయంలో కారు అదుపు తప్పి రేసింగ్ సర్క్యూట్ లో క్రాష్ అయ్యింది. అజిత్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎమర్జెన్సీ టీమ్ అతన్ని కారు నుంచి బయటకి తీసుకుని రక్షించింది. అభిమానులు కంగారుపడాల్సిన అవసరం లేదు, ఇలాంటి సంఘటనలు రేసింగ్ లో సాధారణం అని అజిత్ టీమ్ పేర్కొంది. ప్రస్తుతం అజిత్ బాగానే ఉన్నారని..ఆయన రేసింగ్ కూడా కంటిన్యూ చేస్తారని అజిత్ టీమ్ పేర్కొంది. అజిత్ యాక్సిడెంట్ వార్త బయటకు రావటంతో ఆయన అభిమానులు ఆందోళన పడిపోయారు. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram