ధనుష్ తొలి తెలుగు సినిమాకు 'సార్' టైటిల్ ఖరారు
Continues below advertisement
ప్రముఖ తమిళ కథానాయకుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు, నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన శ్రీమతి సాయి సౌజన్యా శ్రీనివాస్ నిర్మాతగా స్థాపించిన ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఓ సినిమాను నిర్మిస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. దీనిని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించనున్నారు.ధనుష్ హీరోగా రూపొందనున్న ఈ తొలి తెలుగు సినిమాకు 'సార్' (SIR) టైటిల్ ఖరారు చేశారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఇదే టైటిల్ ఖరారు చేశారు.
Continues below advertisement