Chiranjeevi Shocking Comments: కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు | ABP Desam
సినిమాలో సూపర్ స్టార్ ఉండని.. టాప్ హీరోయిన్ గ్లామర్ షో కలిసి రాని .. పాటలు సూపర్ డూపర్ హిట్ అవని.. ఇవన్నీ ఎంతున్నా.. సినిమాలో కంటెంట్ లేకపోతే మాత్రం రిజల్ట్ చేదుగానే వస్తుంది. ఈ మాటలు అందరు చెబుతుండేది. ఐతే... మెగాస్టార్ చిరంజీవి దీనికి కాస్త డోస్ పెంచి... సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీ రిలీజ్ లో ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. సినిమాలో సరైన కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అందుకోసం దర్శకులు కథపై బాగా కసరత్తు చేయాలని సూచించారు. పెద్ద స్టార్లు, హిట్ కాంబినేషన్లు, డేట్స్ దొరికాయి కదా అని హడావుడిగా తీయవద్దని మెగాస్టార్ హెచ్చరించారు.