Chiranjeevi Guinness Book of Records | గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి మెగాస్టార్ చిరంజీవి | ABP

Continues below advertisement

 డ్యాన్స్ అనే పదం వినగానే తెలుగు వాళ్లకు ప్రత్యేకించి సినిమా లవర్స్ కి గుర్తొచ్చే పేరు మెగా స్టార్ చిరంజీవి. ఈ రోజు ఆయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. చిరంజీవి నటించిన 143 సినిమాలను పరిగణనలోకి తీసుకున్న గిన్నిస్ బుక్ ప్రతినిధులు..వాటిలోని 537 పాటల్లో చిరంజీవి వేసిన 24వేల డ్యాన్స్ స్టెప్పులను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి చేర్చుతున్నట్లు ప్రకటన చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ అవార్డ్స్ ను చిరంజీవికి అందించారు. బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ చేతులమీదుగా మెగాస్టార్ ఈ అవార్డును అందుకున్నారు. ప్రపంచంలో మరే హీరో కూడా ఇన్ని వేల స్టెప్పులు వేసింది లేకపోవటంతో ఈ అరుదైన రికార్డు చిరంజీవి ఖాతాలో చేరింది. ఒకే ఏడాదిలో పద్మవిభూషణ్ పురస్కారం ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డ్స్ మెగాస్టార్ అభిమానులకు ఈ ఏడాది ప్రత్యేక బహుమతిగా మిగిలిపోనుంది. చిరంజీవి స్టెప్పులంటే ఫ్యాన్స్ కి మాత్రమే కాదు ఇప్పుడు ప్రపంచం అంతా చిరంజీవి గురించి చదువుకోవాల్సిందే మరి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram