Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
సోషల్ మీడియాలో 'స్నో అక్క'గా విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్న మౌనీషా చౌదరి పేరు ఇప్పుడు బిగ్ బాస్ 10 తెలుగు ప్రొబబుల్స్ లిస్ట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌కు చెందిన మౌనీషా, మ్యారేజ్ తర్వాత అమెరికాలోని ఉటా ప్రాంతంలో స్థిరపడింది. అక్కడ ఐటీ ఉద్యోగం చేస్తూనే మోడల్‌గా, నటిగా, బిజినెస్ ఉమెన్‌గా, పాపులర్ కంటెంట్ క్రియేటర్‌గా మల్టీ టాస్కింగ్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది.
దాదాపు ఎనిమిదేళ్లకు పైగా అమెరికన్ బ్రాండ్లకు మోడల్‌గా పనిచేసిన ఈమె, న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేయడంతో పాటు ఇంటర్నేషనల్ బిల్‌బోర్డ్స్‌పై కూడా కనిపించింది. 2016లో 'మిస్ ఉటా' కిరీటాన్ని సొంతం చేసుకున్న మౌనీషా, తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్, బాడీ షేమింగ్, హరాస్‌మెంట్‌లపై ఓపెన్‌గా మాట్లాడి వార్తల్లో నిలిచింది.
అమెరికాలో మంచు కురిసే వీధుల్లో తనదైన హ్యూమర్‌తో రీల్స్ చేస్తూ, 'డల్లాస్‌పురం యూత్' డైలాగ్స్‌తో ఓవర్ నైట్ వైరల్ అయి 'స్నో అక్క'గా సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆన్‌లైన్ ట్రోల్స్ గురించి ఏమాత్రం మొహమాటం లేకుండా స్ట్రెయిట్‌ఫార్వర్డ్‌గా సమాధానాలు చెప్పడం ఈమె నైజం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ ఎంట్రీపై స్పందిస్తూ, పిలుపు వస్తే హౌస్‌లోకి వెళ్లడానికి రెడీ అని హింట్ ఇవ్వడంతో నెటిజన్లలో ఆసక్తి మరింత పెరిగింది.