Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

మేఘసందేశం సీరియల్‌లో 'భూమి' పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది కన్నడ బ్యూటీ భూమికా రమేష్. కర్ణాటకలోని గుండ్లపేట్‌లో జన్మించిన భూమిక.. చిన్నప్పుడు తరచూ అనారోగ్యానికి గురయ్యేదట. దాంతో డాక్టర్ల సలహాతో ఫిట్‌నెస్ కోసం వాళ్ల అమ్మ ఆమెను డ్యాన్స్ క్లాస్‌లో చేర్పించారు. అలా 12 ఏళ్లకే భరతనాట్యం నేర్చుకుంటూ డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది.

2012లో బెంగళూరులో జరిగిన ఆడిషన్స్ ద్వారా ఆట 6 - జూనియర్స్ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకుంది. ఆ తర్వాత కన్నడ టెలివిజన్‌లో సూపర్ హిట్ అయిన 'భాగ్యలక్ష్మి', 'లక్ష్మి బారమ్మ-2' సీరియల్స్‌తో కర్ణాటకలో భారీ క్రేజ్ సంపాదించుకుంది.

నిజానికి తెలుగులో మొదట ‘మావారు మాస్టారు’, ‘పడమటి సంధ్యారాగం’ సీరియల్స్ ఆఫర్స్ వచ్చినా డేట్స్ కుదరక నో చెప్పింది. చివరకు ‘మేఘసందేశం’ లీడ్ రోల్ దక్కించుకుంది. ఇందులో విశేషం ఏంటంటే.. ఆమె రియల్ నేమ్, సీరియల్ క్యారెక్టర్ నేమ్ రెండూ 'భూమి' కావడమే. ప్రస్తుతం ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. ఈమె ఒక్కో రోజు షూటింగ్‌కు 15,000 నుండి 25,000 వరకు రెమ్యూనిరేషన్ అందుకుంటోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola