Karthikeya 2 National Award | జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 కు అవార్డు | ABP Desam

Continues below advertisement

 శ్రీకృష్ణ తత్వాన్ని సినిమా రూపంలో చూపించి జాతీయ స్థాయిలో సంచలన విజయం సాధించిన తెలుగు సినిమా కార్తికేయ 2కు జాతీయ పురస్కారం దక్కింది. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2 జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. చందూమొండేటి డైరెక్షన్ లో అభిషేక్ అగర్వాల్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన కార్తికేయ 2022 ఆగస్టులో విడుదలై ప్యాన్ ఇండియాలో దుమ్మురేపింది. అనుపమ్ ఖేర్ అద్భుతమైన యాక్టింగ్, నిఖిల్ ప్రామిసింగ్ స్క్రిప్ట్ సెలక్షన్, చందూ మొండేటి డైరెక్టింగ్ ప్రతిభ, శ్రీకృష్ణ తత్వాన్ని వెండితెరపై పోట్రే చేసిన విధానానికి జాతీయ అవార్డుల కమిటి జ్యూరీ సైతం ఫిదా అయ్యింది. మరో వైపు కలెక్షన్లతోనూ దుమ్ము లేపిన కార్తికేయ 2 అప్పట్లో 121కోట్ల రూపాయల కలెక్షన్ సాధించి సంచలన విజయం సాధించింది. ఇప్పుడు జాతీయ అవార్డు వరించటంతో ఆ చిత్రబృందం కష్టానికి ప్రతిఫలం దక్కినట్లైంది. కార్తీకేయ 2 సినిమాకు జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు రావటంపై హీరో నిఖిల్ సిద్దార్థ రియాక్ట్ అయ్యారు. టీమ్ లో తనతో కలిసి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఈ విజయం దక్కుతుందన్నారు నిఖిల్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram