AP Govt Permission Devara Special Shows | ఏపీలో దేవర స్పెషల్ షోలకు స్పెషల్ పర్మిషన్ | ABP Desam

 ఏపీలో దేవర  స్పెషల్ షోలకు స్పెషల్ పర్మిషన్ లభించింది. సెప్టెంబర్ 27న విడుదలవుతున్న దేవర సినిమాకు ఏపీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి లభించింది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం దేవరకు స్పెషల్ షోలు గ్రాంట్ చేస్తూ జీవో ఇచ్చింది. ఫలితంగా అర్థరాత్రి 12గంటలకే దేవర మొదటి షో పడనుంది. అంతేకాదు రోజుకు ఆరు ఆటలు వేసుకునేలానూ అనుమతులు వచ్చాయి. అలాగే టికెట్ ధరలు పెంచుకోవటానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ లో జీఎస్టీతో అప్పర్ క్లాస్ మీద 110రూపాయలు..మల్టీప్లెక్సుల్లో 135రూపాయలు పెంచుకునేందుకు అనుమతులు వచ్చాయి. RRR తర్వాత ఎన్టీఆర్ నటించి విడుదల అవుతున్న సినిమా కావటం..ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే కసితో చేసిన సినిమా కావటంతో దేవర మీద ఫ్యాన్స్ లో  విపరీతమైన అంచనాలు ఉన్నాయి. తొలిరోజే మంచి వసూళ్లు రాబట్టేలా ఇప్పుడు స్పెషల్ షోలు..పెరిగిన టికెట్ రేట్లు హెల్ప్ చేయనున్నాయి. గత ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం జగన్ నిర్ణయాల మేరకు స్పెషల్ షోలను రద్దు చేశారు. టికెట్ రేట్లను భారీగా తగ్గించేశారు. ఫలితంగా భారీ బడ్జెట్ చిత్రాలు వాటి హీరోలు సైతం మార్కెట్ పరంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై అప్పట్లోనే ఎదురు తిరిగిన పవన్ కళ్యాణ్ ఏపీలో ప్రచారం సందర్భంగా అనేక సార్లు టిక్కెట్ల రేట్లు, స్పెషల్ షో లపై మాట్లాడారు. అందరి అభిమానులు తనకు అండగా ఉంటే హీరోలకు తను అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. అనుకున్నట్లగానే కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించటం..పవన్ కళ్యాణ్  డిప్యూటీ సీఎంగా జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గానూ బాధ్యతలు తీసుకున్నారు. కూటమి 100 డేస్ సక్సెస్ ఫుల్ జర్నీ తర్వాత రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా కావటంతో NTR సినిమా దేవరకు మేలు జరిగేలా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. అందుకే దేవర హీరో ఎన్టీఆర్, ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ సైతం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కందుల దుర్గేశ్ కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్లు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola