Anant Ambani Radhika Merchant Wedding | అనంత్ , రాధికా మర్చంట్ ల పెళ్లిలో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ
భారతదేశ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ.. తన తనయుడు అనంత్ అంబానీ పెళ్లికి తెలంగాణకు చెందిన సిల్వర్ ఫిలిగ్రీ కళాఖండాలు కావాలని ఆర్డర్ ఇవ్వడంతో మరోసారి ఈ కళ వార్తల్లోకెక్కింది. సృజనాత్మకత, ఏకాగ్రత, కచ్చితమైన కొలతలకు నిపుణులైన కళాకారులు ప్రావీణ్యం కలిస్తే వచ్చేదే సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్. ముందుగా కొలతలు తీసుకుని నమూనా డయాగ్రామ్ తయారు చేసుకుంటారు. దానికి అనుగుణంగా వెండిని తీగలుగా మలిచి, కావాల్సిన సైజుల్లో కత్తిరిస్తారు. ఆ తీగల ముక్కలను ఫ్రేముల్లో అమర్చుతూ తుది రూపాన్ని తీసుకొచ్చి, ముందుగా రూపొందించుకున్న డయాగ్రాంలో చాలా ఓపికగా, శ్రద్ధగా అతికిస్తారు. దానికి పాలిష్ చేసి, తుది రూపు తీసుకొస్తారు.
సృజనాత్మకత, ఏకాగ్రత, కచ్చితమైన కొలతలకు నిపుణులైన కళాకారులు ప్రావీణ్యం కలిస్తే వచ్చేదే సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్. ముందుగా కొలతలు తీసుకుని నమూనా డయాగ్రామ్ తయారు చేసుకుంటారు. దానికి అనుగుణంగా వెండిని తీగలుగా మలిచి, కావాల్సిన సైజుల్లో కత్తిరిస్తారు. ఆ తీగల ముక్కలను ఫ్రేముల్లో అమర్చుతూ తుది రూపాన్ని తీసుకొచ్చి, ముందుగా రూపొందించుకున్న డయాగ్రాంలో చాలా ఓపికగా, శ్రద్ధగా అతికిస్తారు. దానికి పాలిష్ చేసి, తుది రూపు తీసుకొస్తారు.