అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహ
పుష్ప 2 సినిమా రిలీజ్ కు ముందు రోజు బెనిఫిట్ షోలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిన ఘటనలో అల్లు అర్జున్ పైన కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ థియేటర్‌కు అల్లు అర్జు్న్ వెళ్లినందువల్లే భారీగా జనం రావడం వల్ల తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. ఆ కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు ఆయన్ను తమతో పాటు వెంట తీసుకొని వెళ్లారు. ఈ సమయంలో అల్లు అర్జున్ భార్య ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో అల్లు అర్జున్ ఆమెను ఓదార్చారు. పుష్ప 2 సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అల్లు ఫ్యామిలీ.. ఇప్పుడు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయడంతో షాక్ లో ఉంది. డ్రెస్ మార్చుకునే టైమ్ కూడా ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ అల్లు అర్జున్ వాగ్వాదానికి దిగాడు. ఆ తరవాత జీప్ ఎక్కించి అక్కడి నుంచి చిక్కడపల్లి పీఎస్‌కి తరలించారు.