సోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్

సోషల్ మీడియాలో మొన్నటి వరకూ అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కల్యాణ్ గొడవ నడిచింది. ఇప్పుడు దీనికి Parallel గా AA వర్సెస్ RC ట్రాక్ కూడా మొదలైంది. సోషల్ మీడియా తెరిస్తే చాలు..ఎక్కడో ఓ చోట ఈ కాంట్రవర్సీకి సంబంధించిన పోస్ట్‌లు, వీడియోలు కనిపిస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా...మొన్న పుష్ప 2 ఈవెంట్ అయిన తరవాత ఈ వార్ మరింత ముదిరింది. అసలేంటీ గొడవ...? నిజంగానే అల్లు అర్జున్‌కి, రామ్ చరణ్‌కి విభేదాలు వచ్చాయా..? 

ఈ గొడవ గురించి చెప్పుకునే ముందు ఓ సారి అల్లు అర్జున్, రామ్ చరణ్ కెరీర్‌ గురించి డిస్కస్ చేద్దాం. హీరోగా అల్లు అర్జున్ గ్రాఫ్‌ని పుష్పకి ముందు..పుష్పకి తరవాత అని డిఫైన్ చేయాలి. మెగా ఫ్యామిలీ..అనే స్టాంప్‌ని అల్లు అర్జున్ చెరిపేసుకునే ప్రయత్నం చేసింది కూడా ఈ సినిమా నుంచే. పైగా AA అనే బ్రాండ్‌ని బాగా ప్రమోట్ చేయడం మొదలు పెట్టాడు. స్టైలిష్‌ స్టార్ కాస్తా ఐకాన్ స్టార్ అయ్యాడు. ఇదంతా సింపుల్‌గా జరగలేదు. చాలా రోజులుగా తనని తాను ప్రూవ్ చేసుకోడానికి చాలా కష్టపడ్డాడు. అల్లు అర్జున్ డ్యాన్స్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. 

అదలా ఉంచితే..పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. అసలు ఎవరూ ఊహించని రేంజ్‌లో దాదాపు 2 లక్షల మంది ఫ్యాన్స్ వచ్చారు. గ్రౌండ్ అంతా జనంతో భాయ్ ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోయింది. ఎక్కడో నార్త్‌లోని స్టేట్‌లో అల్లు అర్జున్‌కి ఇంత ఫాలోయింగా అని అందరూ ఆశ్చర్య పోయారు. ఈ ఈవెంట్ తరవాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. "ఇదీ మా భాయ్ క్రేజ్"అని పోస్ట్‌లు పెడుతున్నారు. పైగా ట్రైలర్‌కి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఇక సినిమా రిలీజై అంచనాలకు తగ్గట్టుగా బ్లాక్‌ బస్టర్  కొడతాడని...అల్లు భాయ్‌ని ఆపడం ఎవరి వల్లా కాదని ఫ్యాన్స్ చాలా గట్టిగా తేల్చి చెబుతున్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola