
చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు
అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో పోలీసులు అల్లు అర్జున్ ను ప్రవేశపెట్టారు. పోలీసుల రిమాండ్ రిపోర్ట్ ను పరిశీలించిన న్యాయమూర్తి అల్లు అర్జున్ కు 14రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అత్యంత భద్రత మధ్య అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలిస్తున్నారు. డిసెంబర్ 13 మధ్యాహ్నం ఆయన్ను చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి మెగా కుటుంబంలోనే కాక, అభిమానుల్లో కూడా ఆందోళన నెలకొంది. పోలీసులు అల్లు అర్జున్ ను ఇంటి నుంచి చిక్కడ్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించడం.. అక్కడ ఆయన స్టేట్మెంట్ ను రికార్డు చేసి వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించడం జరిగాయి. ఇంతలో హైకోర్టులో అల్లు అర్జున్ న్యాయవాదులు ఆయనపై నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ వేశారు. దీన్ని హైకోర్టు సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. మరోవైపు, అల్లు అర్జున్ కు మద్దతుగా నిర్మాత దిల్ రాజు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అక్కడకు అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.