అరెస్ట్ చేసే టైమ్‌లో కాఫీ తాగుతూ కూల్‌గా అల్లు అర్జున్
సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం సంచలనం సృష్టించింది. ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో పోలీసులు, అల్లు అర్జున్ మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. కనీసం కాఫీ అయినా తాగనివ్వండి అంటూ అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశాడు. కిందకు వచ్చిన తరవాత కాఫీ తెప్పించుకున్నాడు. పోలీసులతో మాట్లాడుతూనే కాఫీ తాగాడు. ఇలా బెడ్‌రూమ్‌లో నుంచి డైరెక్ట్‌గా తీసుకెళ్లడం కరెక్ట్ కాదని వాదించాడు. అరెస్ట్ కాపీ ఉందని పోలీసులు చెప్పగా..ఇది మరీ టూమచ్ సర్ అని అన్నాడు బన్నీ. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్‌పై చిరంజీవి, నాగబాబు అలెర్ట్ అయ్యారు. వెంటనే అల్లు అరవింద్ ఇంటికి వచ్చారు. కోర్టులో అల్లు అర్జున్‌ని హాజరు పరిచి 14 రోజుల రిమాండ్ కోరేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అయితే...సంధ్య థియేటర్ యాజమాన్యం ఓ లెటర్ రిలీజ్ చేసింది. ముందే అనుమతి అడిగామని, కానీ తమపై ఆరోపణలు చేస్తున్నారని అందులో ప్రస్తావించింది.