చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్
సంధ్య థియేటర్ కేసులో భాగంగా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ని నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తన ఇంటి నుంచి చిక్కడపల్లి పీఎస్‌కి బయల్దేరాడు. అడ్వకేట్‌తో పాటు తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి కార్‌లో పోలీస్ స్టేషన్‌కి బయల్దేరాడు. అంతకు ముందు తండ్రితో మాట్లాడాడు బన్నీ. ఆ తరవాత భార్య స్నేహ అల్లు అర్జున్‌కి ధైర్యం చెప్పింది. హగ్ చేసుకుని ఏమీ కాదంటూ భుజం తట్టింది. పిల్లలతోనూ మాట్లాడిన అల్లు అర్జున్ ఆ తరవాత కార్ ఎక్కి పీఎస్‌కి బయల్దేరాడు. ఈ నేపథ్యంలోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పీఎస్ ముందు పోలీసులు మొహరించారు. విచారణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విచారణలో బన్నీని ఏం ప్రశ్నలు అడుగుతారన్న ఉత్కంఠ కొనసాగుతోంది. పోలీసులు అల్లు అర్జున్‌ని దాదాపు 20 ప్రశ్నలు అడుగుతారని సమాచారం. ఇప్పటికే ఈ వివాదంపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు.