
అల్లు అర్జున్‌కి పదేళ్ల జైలు తప్పదా..?
సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అయితే..అల్లు అర్జున్‌కి ఈ కేసులో బెయిల్ కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ కేసులో అల్లు అర్జున్ A2గా ఉన్నారు. భారతీయ న్యాయ సన్హిత చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం...అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. హత్య కాకపోయినా...ఒకరు ప్రాణాలు కోల్పోడానికి కారణమైనా...ఈ సెక్షన్ కింద కేసు నమోదవుతుంది. ఓ రకంగా చూస్తే..ఇది పరోక్షంగా హత్యాయత్నం కిందకే వస్తుంది. దోషిగా తేలితే...కనీసం ఐదేళ్ల నుంచి మ్యాగ్జిమమ్ పదేళ్ల వరకూ జైలు శిక్ష పడుతుంది. దీంతో పాటు 118(1) కింద నాన్‌బెయిలబుల్ కేసు కూడా రిజిస్టర్ అయింది. అంటే...ఈ సెక్షన్‌ల ప్రకారం చూసుకుంటే...బెయిల్ మంజూరు అయ్యే అవకాశమే లేదు. అయితే..తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టులో బన్నీకి ఇంకా ఊరట లభించలేదు. న్యాయస్థానం ఇంకా తీర్పును వెలువరించలేదు. ఇదే ఘటనలో సంధ్య థియేటర్ యాజమాన్యంపైనా కేసు నమోదైంది. ఇప్పుడు అల్లు అర్జున్‌ని కోర్టులో హాజరుపరిచే అవకాశముంది.