ఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?
ఒక్క డెసిషన్...ఈరోజు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లింది. ఇట్స్ ఏ అన్ ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఎవరూ కావాలనుకుని చేయరు. కానీ జరిగిన అనర్థం...ఓ సూపర్ స్టార్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ని ఎంజాయ్ చేయనివ్వకుండా చేస్తోంది. తన మూడేళ్లు కష్టపడిన చేసిన పుష్ప 2 సినిమా. తనకు నేషనల్ అవార్డ్ వచ్చి నతర్వాత చేసిన మొదటి సినిమా...అభిమానులతో కలిసి చూడాలని వాళ్లతో ఆ ఎంజాయ్మెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాలని అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయం ఈ రోజు ఆయన్ను పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టింది. డిసెంబర్ 4 న రాత్రి అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్స్ మొదలయ్యాయి. రాత్రి 9.30 లకు సంధ్యా థియేటర్ లో. తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు తీసే ఏ హీరోకైనా..ఏ సినీ అభిమానికైనా సంధ్యా థియేటర్ తో ఓ స్పెషల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఆ థియేటర్ లో సినిమా చూడటాన్ని ఓ సెంటిమెంట్ గా భావిస్తుంటారు. బన్నీ కూడా అలాగే అనుకున్నాడు. సంధ్యాకి ప్రీమియర్స్ కి అల్లు అర్జున్ వస్తున్నాడంటూ ముందు రోజు నుంచే బన్నీ టీమ్ ప్రచారం చేసింది. మాములుగా పుష్ప గాడి బ్రాండ్ ని భూగోళమంతా వినిపించేలా సంబరాలు చేస్తున్న అల్లు అర్జున్ అభిమానులు ఆ రోజు మరింతగా రెచ్చిపోయారు. ఆ తోపులాట తొక్కిసలాట ఓ అమాయకపు మహిళ ప్రాణాలు కోల్పోతుంది. ఆమె చేతిలో ఉన్న పసిపిల్లాడు ఈ రోజుకు ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. త