Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ

Continues below advertisement

కన్నడ, తెలుగు బుల్లితెరపై తన నటనతో, గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య వర్మ. నటనపై ఉన్న విపరీతమైన ఆసక్తితో తల్లిదండ్రులను సైతం ఎదిరించి పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ కన్నడ ముద్దుగుమ్మ, మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది.

కర్ణాటకకు చెందిన ఐశ్వర్య, కెరీర్ ప్రారంభంలో కన్నడ సీరియల్స్, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఐటీ ఎక్స్‌పర్ట్ అభినయ్ వర్మను వివాహం చేసుకున్న తర్వాత ఆమె కొంతకాలం నటనకు దూరమై, సొంతంగా ఒక స్టార్టప్ కూడా ప్రారంభించింది. అయితే, యాక్టింగ్ పై ఉన్న పాషన్‌ను గుర్తించిన భర్త ప్రోత్సాహంతో మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో ప్రముఖ సీరియల్ 'చామంతి'లో 'రోజా' అనే నెగెటివ్ పాత్రలో నటించి ఐశ్వర్య మంచి ఫేమ్ సంపాదించుకుంది. విలనిజం, గ్లామర్‌ను మేళవించి ఆమె పండించిన అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బుల్లితెరపై బోల్డ్ అండ్ గ్లామరస్ రోల్స్ చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ సెట్ చేసుకుంది. ఐశ్వర్య వర్మకు ఒక రోజుకు సుమారు 10,000 నుంచి 25,000 రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె మరికొన్ని తెలుగు, కన్నడ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola