Agnisakshi Aishwarya Pisse Remuneration | అగ్నిసాక్షి హీరోయిన్ ఎమోషనల్ లైఫ్ స్టోరీ

Continues below advertisement

'అగ్నిసాక్షి' సీరియల్‌లో గౌరి పాత్రతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కన్నడ బ్యూటీ ఐశ్వర్య పిస్సే రియల్ లైఫ్ వెనుక ఎవరికీ తెలియని ఎన్నో కష్టాలు ఉన్నాయి. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ హీరోయిన్‌గా ఉన్న ఐశ్వర్య.. రోజుకు సుమారు 15,000 నుండి 25,000 వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్.

1990 ఫిబ్రవరి 16న బెంగళూరులో జన్మించిన ఐశ్వర్య.. చిన్నతనంలోనే తండ్రి వదిలేసి వెళ్ళిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. నిజానికి ఆమె ఒక ఆయుర్వేదం డాక్టర్ కావాలని కలలు కనేది. కానీ, తల్లి పడే కష్టాలు చూడలేక చదువు మధ్యలోనే ఆపేసి, కుటుంబానికి అండగా నిలబడటం కోసం చాలా చిన్న వయసులోనే నటన వైపు అడుగులు వేసింది.

కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేసిన ఐశ్వర్య.. హీరో యష్ 'సంతు స్ట్రైట్ ఫార్వర్డ్' సినిమాలోనూ చిన్న రోల్ చేసింది. ఆ తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి 'అగ్నిసాక్షి', 'కస్తూరి',  'ముక్కుపుడక' సీరియల్స్‌తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇక స్టార్ మా 'ఇస్మార్ట్ జోడి' రియాలిటీ షోలో తన భర్త హరి వినయ్‌తో కలిసి పాల్గొని బుల్లితెర జంటగా మరింత పాపులర్ అయింది. తెరపై ఎంత గ్లామరస్‌గా కనిపించినా, రియల్ లైఫ్‌లో ఎంతో సింపుల్‌గా ఉండే ఐశ్వర్య పిస్సే జర్నీ ఎంతోమందికి ఇన్‌స్పిరేషన్. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola