ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

మహానటి కీర్తి సురేశ్ పెళ్లి గోవాలో వైభవంగా జరిగింది. తన ప్రియుడు ఆంటోనితో కలిసి ఏడడుగులు వేసింది. 15 ఏళ్లుగా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయ్యంగార్ సంప్రదాయం ప్రకారం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆండాళ్‌ కొండాయ్ వేషధారణలో చాలా క్యూట్‌గా కనిపించింది కీర్తి. ఈ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్ట్‌కి ForTheLoveOfNyke అనే హ్యాష్‌ట్యాగ్‌ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖులంతా హ్యాపీ మ్యారేజ్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  ఈ వివాహానికి దళపతి విజయ్ హాజరయ్యాడు. విజయ్‌తో పాటు మరికొందరు ప్రముఖులు వెళ్లారు. గోవాలో పెళ్లి చేసుకుంటున్నానని గత నెలలోనే గుడ్ న్యూస్ చెప్పింది కీర్తి సురేశ్. పెళ్లికి ముందు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్లారు. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ నుంచి విడుదలయ్యే మొదటి సినిమా 'బేబీ జాన్'. తమిళంలో దళపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన 'తెరి' చిత్రానికి హిందీ రీమేక్ అది. సమంత తమిళం సినిమాలో పోషించిన పాత్రను హిందీలో కీర్తి సురేష్ చేశారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola