Actor Pragathi Won Gold Medal in Weightlifting | గోల్డ్ మెడల్ గెలిచిన యాక్టర్ ప్రగతి

ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అన్న మాటను నిజం చేసారు ఒక తెలుగు యాక్టర్. 100 పైగా సినిమాలో నటించిన ఈ యాక్టర్ ప్రొఫెషనల్‌ పవర్‌ లిఫ్టర్‌గా మారి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. ఆమె ఎవరో కాదు యాక్టర్ ప్రగతి. కేరళలో జరిగిన నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025 లో గోల్డ్ మెడల్ సాధించారు. 50 ఏళ్ల వయసులో ప్రగతి పట్టుదల చూసిన వారంతా షాక్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో సిల్వర్ మెడల్ సాధించిన ప్రగతి ఇప్పుడు మూడు మెడల్స్ సొంతం చేసుకుంది. కేరళలో జరిగిన నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ 2025 పోటీల్లో గోల్డ్ మెడల్ తో పాటు మరో రెండు మెడల్స్ గెల్చుకున్నారు. స్క్వేట్ 115 కిలోలు, బెంజ్ ప్రెస్ 50 కిలోలు, డెడ్ లిఫ్టు 122.5 కిలోల పోటీల్లో పతకాలను సాధించారు. నేషనల్ ఛాంపియన్ షిప్ లో మూడు మెడల్స్ సాధించినట్లు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ప్రగతి. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola