Acharya New release date: ఆచార్య రిలీజ్ అయ్యేది అప్పుడే
మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రాంచరణ్ కలిసి నటించిన ఆచార్య చిత్రం కొత్త విడుదల తేదీ ఖరారైంది. ఇటీవలే ఫిబ్రవరి 4న సినిమా రావట్లేదంటూ ప్రకటించిన చిత్రబృందం.... ఇప్పుడు ఏప్రిల్ 1న సినిమా విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది. ట్విట్టర్ లో ఓ పోస్టర్ ను పోస్ట్ చేసింది. అయితే ఏప్రిల్ 1ని విడుదల తేదీగా ఇప్పటికే మహేష్ సర్కారువారి పాట ప్రకటించగా.... ఇప్పుడు ఆచార్య కూడా అదే తేదీకి రాబోతుండటం విశేషం. మరి ఆ సమయానికి మహేష్ సినిమా రిలీజ్ డేట్ లో ఏమైనా మార్పులు ఉంటాయేమో చూడాలి.