Voter ID Registration: 17 ఏళ్లకే ఓటర్ కార్డుకు దరఖాస్తు చేయొచ్చు. ఎన్నికల సంఘం కీలక ప్రకటన!
భారత దేశంలో ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకుని గుర్తింపు కార్డు పొందేందుకు ఎవరైనా 18 సంవత్సరాలు నిండే వరకు వేచి చూడాలి. కానీ ఇపుడు 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 17 ఏళ్లు నిండిన యువతకు ముందస్తుగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ విషయ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపింది.