Uddhav Thackeray on Chandrababu Naidu | చంద్రబాబు ఇండియా కూటమిలోకి వస్తారన్న ఉద్ధవ్ ఠాక్రే| చంద్రబాబు ఇండియా కూటమిలోకి వస్తారన్న ఉద్ధవ్ ఠాక్రే
విన్నారుగా..! శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే ఏం చెప్పారో..! చంద్రబాబు కూడా ఎన్డీయే కూటమి కాదని... ఇండియా కూటమిలోకి వస్తారట. ఎందుకంటే... బీజేపీ చంద్రబాబు నాయుడిని కూడా చాలా టార్చర్ పెట్టింది.. ఇప్పుడు మోదీ వ్యతిరేకులమంతా ఏకమవుతున్నామని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. అసలు.. దేశ రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు పేరు గట్టిగా వినిపించడానికి కారణం ఏంటంటే...మోదీ మెజార్టీ తగ్గడం.
విన్నారుగా..! శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే ఏం చెప్పారో..! చంద్రబాబు కూడా ఎన్డీయే కూటమి కాదని... ఇండియా కూటమిలోకి వస్తారట. ఎందుకంటే... బీజేపీ చంద్రబాబు నాయుడిని కూడా చాలా టార్చర్ పెట్టింది.. ఇప్పుడు మోదీ వ్యతిరేకులమంతా ఏకమవుతున్నామని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. అసలు.. దేశ రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు పేరు గట్టిగా వినిపించడానికి కారణం ఏంటంటే...మోదీ మెజార్టీ తగ్గడం. నిన్న విడుదలైన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 240కి పైగా స్థానాలు మాత్రమే సాధించింది. మొత్తంగా ఎన్డీయే కూటమి 292 స్థానాలకే పరిమితమైంది. మెజార్టీకి 272 సీట్లు కావాలి. అంటే మెజార్టీ కంటే 20 సీట్లే ఎక్కువ సాధించారు. అందులో 16 సీట్లు టీడీపీవీ, 2 సీట్లు జనసేనవి...12 సీట్లు నితీశ్ కుమార్ వి. సో..ప్రధాని మోదీ కావాలంటే వీళ్ల మద్దతు కీలకం. ఇప్పుటికే నితిశ్ కుమార్ పక్క చూపులు చూస్తున్నారు. ఒకవేళ.. చంద్రబాబు కూడా ఎన్డీయే కు మద్దతునివ్వకపోతే మోదీ గవర్నమెంట్ రాదు. అందుకే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ లకు చంద్రబాబు ఆశాదీపంగా కనిపిస్తున్నారు. ఎన్నికలకు ముందే ఎన్డీయే కూటమిలోకి చంద్రబాబు వచ్చారు కాబట్టి 99శాతం మోదీతోనే ఉంటారు. కానీ, గత 5 ఏళ్లుగా బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబును ఎంత ఇబ్బంది పెట్టిందో అందరికి తెలుసు. కాబట్టి.. దానికి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. తమతో జత కలిస్తే మోదీ కొట్టవచ్చని ఇండియా కూటమి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు