KTR Old Tweet On Revanth Reddy: తక్కువ చేసిన ప్రతి నోటినీ మూయించిన రేవంత్ రెడ్డి
Who is that..? అని ఎగతాళి చేశారు. అతనెవరో.. ఇవాళ కళ్లకు కనబడుతోంది. రవ్వంత రెడ్డి అంటూ తక్కువ చేశారు. రవ్వ కాదు.. అది అగ్గి రవ్వ అన్న విషయం అర్థమైంది. కేసీఆర్ స్టేచర్ కు సరిపోయే కేరక్టర్ అటువైపుందా అన్నారు. ఆ కొండను ఢీకొట్టిన కేరికేచర్ ఇదీ అని చూపించాడు. ఓ చిన్న చినుకై.. వానై... వరదై తొమ్మిదేళ్లుగా తెలంగాణను ఏలుతున్న రాజకీయ కుటుంబాన్ని ముంచేసిన ఆ సునామీనే అనుముల రేవంత్ రెడ్డి.
Tags :
CONGRESS Revanth Reddy Elections 2023 Telangana Elections 2023 Telangana Election Results Elections Results 2023