Mudragada Padmanabham on Pawan Kalyan | Pithapuram | పవన్ కల్యాణ్ విజయంపై ముద్రగడ రియాక్షన్
ఇంత సంక్షేమం చేసినప్పటికీ...జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారో అర్థం కావడం లేదని ముద్రగడ పద్మనాభం అన్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలిచారు. ఆయన గెలిస్తే పేరు మార్చుకుంటునాని సవాల్ విసిరిన ముద్రగడ..సవాల్ ప్రకారం పేరు మార్చుకుంటున్నట్లు ప్రకటించారు.
మాజీ మంత్రి ముద్రగడ చెప్పినట్టుగానే పేరు మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇకపై తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని ఇవాళ ప్రకటించారు. దీనికి అధికారిక ప్రక్రియ ఉంటుందని అది త్వరలోనే పూర్తి చేస్తానంటూ చెప్పుకొచ్చారు.
కాపు ఉద్యమ నేతగా పేరు పొందిన పద్మనాభం.... ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. అప్పటి నుంచి వైసీపీ అభ్యర్థుల విజయానికి ప్రచారం చేశారు. ఆ టైంలో పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన పద్మనాభం... ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కచ్చితంగా ఓడిపోతారని అభిప్రాయపడ్డారు. ఒక వేళ పవన్ కల్యాణ్ విజయం సాధిస్తే మాత్రం తాను తన పేరు మార్చుకుంటానంటూ ప్రకటించారు. ఎన్నికల్లో పవన్ గెలిస్తే మాత్రం తన పేరు ముద్రగడ పద్మనాభం కాదని.... పద్మనాభ రెడ్డి అంటూ అప్పట్లో చెప్పడం సంచలనం అయింది.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీంతో అప్పటి నుంచి పద్మనాభంపై ట్రోల్స్ నడుస్తున్నాయి. పద్మనాభం నామకరణ మహోత్సవం అంటూ ఆయనపై సెటైర్లు వేశారు.