DGP Anjani Kumar Meets Revanth Reddy: శుభాకాంక్షలు చెప్పిన డీజీపీ

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో 60కి పైగా స్థానాల్లో ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. మేజిక్ ఫిగర్ ను స్పష్టంగా క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గాంధీ భవన్ వద్ద, రేవంత్ రెడ్డి నివాసం వద్ద సంబరాలు వేరే లెవెల్ కు చేరాయి. ఇప్పుడు డీజీపీ అంజనీ కుమార్ సహా... ఇతర పోలీసు ఉన్నతాధికారులు రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెప్తూ బొకేలు కూడా అందించారు. రేవంత్ రెడ్డి వారిని స్వాగతించి వారి అభినందనలు అందుకున్నారు. రేవంత్ రెడ్డి వదనంలో విజయానందం స్పష్టంగా కనపడుతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola