CM Jagan First Reaction After Defeat | మా పార్టీ కోసం నిలబడిన వాళ్లకు నేను తోడుంటా | ABP Desam
రాయలసీమలో కీలక జిల్లా వైఎస్‌ఆర్ కడప జిల్లా. ఈ జిల్లా తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి, ఆ తరువాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వస్తోంది. గడిచిన మూడు ఎన్నికల్లోనూ ఇక్కడ కాంగ్రెస్, ఆ తరువాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను దక్కించుకుంటూ వచ్చింది. ఈ జిల్లాలో కడప పార్లమెంట్ స్థానం ఉంది. మొత్తంగా ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా, గడిచిన మూడు ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను టీడీపీయేతర పార్టీలే దక్కించుకున్నాయి. 2009లో కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాల్లో విజయం సాధించగా, 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ మొత్తం స్థానాలను గెల్చుకుని క్లీన్ స్వీప్ చేసింది. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ వైసీపీ మరోసారి ఈ జిల్లాలో క్లీన్‌స్వీప్ చేసింది. అలాగే, 2010లో జరిగిన ఉప ఎన్నిక ఏకగ్రీవం కాగా, 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయాన్ని దక్కించుకున్నారు. ఈ జిల్లాలోని ఓటర్లు తొలి నుంచి వైఎస్‌ఆర్‌కు అండగా ఉంటూ వస్తున్నారు. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మళ్లారు.