Hyderabad Illegal Massage Parlours: అనుమతి లేని స్పా సెంటర్లపై టాస్క్ ఫోర్స్ దాడులు
Continues below advertisement
హైదరాబాద్ లో అనుమతి లేకుండా అక్రమంగా స్పా అండ్ మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయా సెంటర్ల పై దాడి చేసారు. మహంకాళి, కార్ఖానా మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసాజ్ / SPA సెంటర్‌లపై ఏకకాలంలో దాడులు నిర్వహించి 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో నలుగురు నిర్వాహకులు , 12 మహిళా కార్మికులు వున్నారు. అదేవిధంగా సెంట్రల్ జోన్ పరిధిలో అక్రమంగా నడుస్తున్న స్పా మసాజ్ సెంటర్‌పై దాడి జరిగింది. రాంగోపాల్‌పేట, నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడు మసాజ్ / SPA సెంటర్‌లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పట్టుబడినవారిలో ఇద్దరు మేనేజర్లు , ఒక రిసెప్షనిస్ట్, ఐదు మంది మహిళా కార్మికులు వున్నారు.
Continues below advertisement