Srikakulam Petrol bunk thief : శ్రీకాకుళం జిల్లా పెట్రోల్ బంక్లో చోరీ | ABP Desam
శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం పెట్రోల్ బంక్లో ఓ దొంగ చాకచక్యంగా చోరీకి పాల్పడ్డాడు. పెట్రోల్ కోసం ఆగి ఉన్న వాహనంలోని రూ.3.5 లక్షలు అపహరించాడు. చోరీ చేసిన దృశ్యాలు సీసీ టీవీ పుటేజీలో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.