CC Visuals: హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ సీసీ కెమెరా దృశ్యాలు
Continues below advertisement
హీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్ తేజ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయనకు అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బైక్‌పై వేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేల్చారు. బైక్‌ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయారని పేర్కొన్నారు. ఈ ప్రమాదం దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
Continues below advertisement