Death Punishment To Murderer: తొమ్మిది నెలల్లోనే తీర్పు | Guntur Fastrack Court | ABP Desam
పరమాయికుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్యను నడిరోడ్డుమీద దారుణంగా చంపిన శశికృష్ణకు ఇవాళ ఉరిశిక్ష ఖరారు చేశారు. గతేడాది ఆగస్టు 15న రమ్యను శశికృష్ణ దారుణంగా చంపేశాడు. సోషల్ మీడియాలో పరిచయమైన తనని ప్రేమించట్లేదనే కక్షతో రమ్యను హతమార్చాడు. ఈ హత్య కేసులో తుది తీర్పును గుంటూరులోని ప్రత్యేక కోర్టు ఇవాళ వెల్లడించింది. తొమ్మిది నెలల్లోనే విచారణ పూర్తి చేసింది ఫాస్ట్ ట్రాక్ కోర్టు. దాదాపు 28మంది సాక్షులను విచారించాక శశికృష్ణకు ఉరిశిక్ష వేయాలంటూ జస్టిస్ రాంగోపాల్ తీర్పునిచ్చారు.
Tags :
Death Punishment To Ramya Murder Death Punishment To Sasikrishna Guntur Fastrack Court Verdict