Ananthapur: గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న క్రికెట్ బుకీల అరెస్టు
Continues below advertisement
గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న క్రికెట్ బుకీలను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నం, కర్ణాటకకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసి... ఆరు లక్షల నగదు, ల్యాప్ టాప్ లు, 24 మొబైళ్లు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 24 అకౌంట్ల లావాదేవీలు ఫ్రీజ్ చేసి రెండు కోట్లకుపైగా లావాదేవీలు నిలుపుదల చేశారు. నిందితుల నుంచి 4.5 కిలోల గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నారు. ఫ్రీజ్ చేసిన అకౌంట్లపై దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు.
Continues below advertisement