Hindenburg Report Effect on Adani Group Stocks fall | అదానీ షేర్లు ఢమాల్.. మార్కెట్‌ అల్లకల్లోలం |

Continues below advertisement

Hindenburg Report Effect on Adani Group Stocks fall | హిండెన్‌బర్గ్ రిపోర్టు మరోసారి అదానీ గ్రూప్ ను అతలాకుతలం చేస్తోది. హిండెన్ బర్గ్ రిపోర్టుపై ఆదివారం సెబీ ఛైర్ పర్సన్ చేసిన కామెంట్స్ తరువాత సోమవారం మార్కెట్ తెరచుకున్న వెంటనే అదానీ షేర్లు ఢమాల్ అని పడిపోయాయ. మొత్తంగా అదానీ షేర్లలో 7 శాతం నష్టపోగా.. ఇన్వేస్టర్లు సుమారు 53వేల కోట్లు నష్టపోయినట్లు అంచనా. అత్యధికంగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 17శాతం నష్టాల్లో కొనసాగుతోంది. గతంలో హిండెన్ బర్గ్ ఇచ్చిన రిపోర్టులో అదానీ షేల్ కంపెనీల గురించి ప్రస్తావిస్తే.. ఇప్పుడు ఏకంగా సెబీ ఇన్వాల్వ్మెంట్ ఉందని రిసేర్చ్ తెలిపింది. అదానీ షేర్ల విలువ ఆర్టిఫిషియల్ గా పెంచేందుకు ఉపయోగించిన మారిషస్‌ ఫండ్‌లలో సెబీ ఛైర్​పర్సన్​ మాధబి పురికి వాటాలు ఉన్నాయని చేసిన హిండెన్‌బర్గ్‌ రిపోర్టులో చెప్పింది. ఐతే.. ఈ రిపోర్టును ఖండిస్తూ సెబీ చీఫ్‌ మాధబి బచ్‌ చేసిన వ్యాఖ్యలు మరిన్ని ప్రశ్నలకు అనుమానాలు కలుగజేస్తోందని హిండెన్‌బర్గ్‌ పేర్కొంది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram