PM Aawas Yojana: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భారీగా ఇళ్ల నిర్మాణం
Continues below advertisement
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మధ్యతరగతి కుటుంబాలకు కీలక హామీ ఇచ్చారు. పీఎం ఆవాస్ యోజన కింద 2022-23 ఏడాదిలో 80 లక్షల ఇళ్లను నిర్మిస్తామన్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.48,000 కోట్లు కేటాయించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హత ఉన్న లబ్ధిదారులకు పీఎం ఆవాస్ యోజన కింద ఈ ఇళ్లను అందిస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారు, పట్టణ ప్రాంతాల్లో ఉంటోన్న మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పీఎం ఆవాస్ యోజన.. ఎంతోమంది సొంతింటి కలను నెరవేర్చుతుందన్నారు ఆర్థిక మంత్రి.
Continues below advertisement