Economic Survey 2022: పార్లమెంటులో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్

Continues below advertisement

కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన ఈ టైంలో ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ పై భారీ అంచనాలున్నాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడటానికి....కరోనా వల్ల కుదేలైన రంగాలను పునరుజ్జీవం పొందటానికి ఈ సారి బడ్జెట్ చాలా కీలకం అని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టారు. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ లో ఇండియా గ్రోత్ రేట్ 8-8.5 శాతంగా ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేస్తోంది. ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్ లో జీడీపీ 9.2శాతంగా నమోదవచ్చని తెలిపింది. మరో వైపు మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రీ కోవిడ్ సిచ్యుయేషన్ కి చేరుకుంటుందని సర్వే ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram