Budget2022-2023 | జన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని కోరుతున్న తెలంగాణ ప్రభుత్వం.
ప్రతి ఏడాది కేంద్ర బడ్జెట్‌కు సమయం ముంచుకు వస్తోందంటే తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అవుతుంది. తమకు ఏం కావాలో చెబుతూ విభాగాల వారీగా లేఖలు రాసి విజ్ఞప్తులు చేస్తూ ఉంటుంది. అంతిమంగా బడ్జెట్ ప్రకటించిన తర్వాత అంతా చూసుకుని దేనికీ నిధులు కేటాయించలేదే అని అసంతృప్తికి గురవుతూ ఉంటుంది. ఈ సారి కూడా తమకు కేంద్ర బడ్జెట్‌లో ఏమేం కావాలో లేఖల ద్వారా కేంద్రానికి తెలియచేశారు. బడ్జెట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.