Budget Expectations: టాక్స్ శ్లాబులు పెంచండిపన్నులు తగ్గించండి బడ్జెట్ పై ఉద్యోగుల ఆశలివే|ABP Desam
ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఒక వర్గం ప్రజలు ఆశగా ఎదురు చూస్తుంటారు! ప్రభుత్వం తమకు డబ్బులు మిగిలించే పనేదైనా చేసిందా అని! వారే ఉద్యోగులు. ఇంకా చెప్పాలంటే నిజమైన పన్ను చెల్లింపుదారులు!! ఎప్పుడో 2014లో సవరించిన ఆదాయపన్ను శ్లాబులను మళ్లీ ఇప్పటి దాకా మార్చలేదు. మళ్లీ బడ్జెట్‌కు వేళైంది. ఈ సారైనా ఏదైనా మార్పు చేస్తారా అని ఉద్యోగవర్గాలు ఎదురు చూస్తున్నాయి.