Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం

Continues below advertisement

ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా  సైబర్ క్యాబ్ ) రైడ్స్ విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంటూ హాట్ టాపిక్‌గా మారాయి. స్టీరింగ్ వీల్, ఏక్సిలరేటర్,  బ్రేక్ పెడల్స్ వంటివి ఏమీ లేకుండా కేవలం పూర్తిస్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సార్లతో నడిచే ఈ రోబోటాక్సీలు రోడ్లపైకి రావడం  ఒక సరికొత్త విప్లవానికి తెరలేపింది. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన భవిష్యత్తు సాంకేతికత ఇప్పుడు నేరుగా అమెరికా వీధుల్లోకి రావడంతో, ఈ సైబర్ క్యాబ్‌లలో ప్రయాణించేందుకు ప్రజలు, టెక్ ప్రియులు అత్యంత ఆసక్తి చూపుతున్నారు.
 
టెస్లా సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ టూ-సీటర్ ఫుల్లీ అటానమస్ ఎలక్ట్రిక్ వెహికల్‌ను ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా బుక్ చేసుకుంటున్నారు. రెండు వింగ్ టైప్ డోర్లతో  ఫ్యూచరిస్టిక్‌గా డిజైన్ చేసిన ఈ కార్లలోకి ఎక్కగానే, ముందు భాగంలో ఒక పెద్ద ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ప్యాసింజర్లకు స్వాగతం పలుకుతుంది. రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్స్, మలుపులు, ఇతర వాహనాలను కచ్చితమైన ఏఐ ఆటోపైలట్ సిస్టమ్ ద్వారా గుర్తిస్తూ.. ఎంతో సురక్షితంగా, ప్రశాంతంగా గమ్యస్థానాలకు చేరవేస్తుండటంతో ప్రయాణికులు థ్రిల్ ఫీల్ అవుతున్నారు.
 
ఈ సైబర్ క్యాబ్ రైడ్స్ వల్ల రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.  సాధారణ మైలేజ్ కార్ల కంటే మైలుకు అయ్యే వ్యయం చాలా తక్కువగా ఉంటుందని క్యాబ్‌లు బుక్   చేసుకున్నవారు చెబుతున్నారు. వైర్‌లెస్ ఇండక్షన్ ఛార్జింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ డ్రైవర్‌లెస్ కార్లు ప్రజా రవాణా రూపురేఖలనే మార్చేస్తున్నాయని అమెరికా నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. భవిష్యత్తులో ఈ తరహా డ్రైవర్‌లెస్ రోబోటాక్సీ సేవలు ఇతర దేశాలకు కూడా విస్తరిస్తే ప్రయాణ ప్రాసెస్ పూర్తిగా మారిపోతుందనడంలో సందేహం లేదు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola