YSRCP TDP Members Fight With Bombs | పల్నాడు హింస ఏపీ రాజకీయ చరిత్రలో మాయని మచ్చ | ABP Desam

Continues below advertisement

పల్నాడు లో పోలింగ్ అనంతరం జరిగిన దాడులు రావ్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగించాయి...మూక దాడులు, వాహనాల దహనం, రాళ్ళ దాడులు నుంచి పెట్రోల్ బాంబువ దాడులతో దద్దరిల్లింది పల్నాడు.. ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా, ఆటవిక పాలనలో కొనసాగుతున్నామా అన్న సంశయము కలిగించింది..ఈ ప్రతీకార దాడులు చూస్తుంటే పార్టీ నాయకులు ఫ్యాక్షన్ లీడర్లుగా మారారన్న భావన కలగక మానదు. అసలు ఈ స్థాయిలో దాడులు జరగటానికి కారణాలేంటీ..సిట్ విచారణ తర్వాత తేలిన ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటీ..ఈ వీడియోలో చూద్దాం.

 

పల్నాడు ప్రాంతంలో పోలింగ్ రోజు ఉద్రిక్తంగా ఉండటం సహజం..కానీ ఈ సారి ఈ ప్రాంతంలో ఎలక్షన్ తర్వాత హింస చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది..పోలింగ్ జరుగుతున్న సమయంలో  బూత్ ల పరిశీలనకు వచ్చిన నర్సారావుపేట  ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలతో ప్రాంరంభమైన దాడి యత్నాలు ఆ తర్వాత మాచర్ల వైసపీ అబ్యర్థి పిన్నేల్లి రామకృష్ణ రెడ్డి, ప్రత్యర్థి టీడీపీ అబ్యర్థి జూలకంటి బ్రహ్మా రెడ్డి వరకు కొనసాగింది... సత్తెనపల్లి లో టీడీపీ అబ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ... వైసీపీ అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబు ఎదురెదురు పడిన సందర్భలో ఉద్రిక్తత చోటు చేసుకుంది...నర్సారావుపేట టీడీపీ అభ్యర్థి డా.అరవింద బాబు మునిసిపల్ హైస్కూల్  లో ಓటింగ్ సరళి పరిశీలించేందుకు వెళ్ళిన సదర్బంలో వైసీపీ శ్రేణులు దాడి చేశారు...అప్పటికి పోలింగ్ సమయం పూర్తి కావడంతో ఇక గొడవలు ఉండవని భావించారు..‌అయితే అంచనాలు తలకిందులు చేస్తూ ఒక్క సారిగా హింస చెలరేగింది..‌

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram