YSRCP MLA Jagan Mohan Rao: ఎమ్మెల్యేను నిలదీసిన Paritala గ్రామ ప్రజలు
వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇళ్లు లేవు, కరెంట్ స్తంభాలు లేవంటూ గ్రామస్థులు ఆయనను నిలదీశారు. ఉద్రిక్తత పెరిగి ఎమ్మెల్యే, గ్రామస్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓట్లు అడగడానికి మళ్లీ వచ్చినప్పుడు చెప్తామని గ్రామస్థులు అంటున్నారు. మా ఇంటికి రావొద్దంటూ బహిరంగంగానే చెప్తున్నారు.