Roja: ఎంపీపీ పీఠాల కోసం నగరిలో రోడ్డున పడ్డ వైసీపీ రాజకీయం..!

Continues below advertisement

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలో పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేవు. ఎంపీపీ ఎన్నికల్లో తన వర్గీయులను చైర్మన్లుగా ఎంపిక చేసుకునేందుకు పార్టీ తరపున అధికారికంగా అనుమతి తెచ్చుకున్నప్పటికీ నియోజకవర్గంలోని మండల స్థాయి నేతలు మాత్రం ఆమె మాట వినడం లేదు. ముఖ్యంగా నిండ్ర మండలంలో ఎంపీపీ ఎన్నిక విషయంలో  ఆమె మాటను ఎంపీటీసీలు లెక్క చేయడం లేదు. నిండ్ర మండలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడైన చక్రపాణి రెడ్డి పార్టీ వ్యవహారాలను చక్కబెడుతూ ఉంటారు. నిండ్ర ఎంపిపి స్థానానికి ఎమ్మెల్యే  ఆర్కే రోజా దీపా అనే అభ్యర్థిని ఎంపిక చేశారు.  అయితే ప్రస్తుతం శ్రీశైలం బోర్డు చైర్మన్ గా ఉన్న చక్రపాణి రెడ్డి మాత్రం తన  తమ్ముడు భాస్కర్ రెడ్డిని ఎంపీపీగా చేయాలని ఐదుగురు ఎంపీటీసీలతో క్యాంపు నిర్వహించారు. దీంతో 24వ తేదీన జరగాల్సిన ఎంపీపీ ఎన్నిక శనివారానికి వాయిదా పడింది.  ఎంపీపీ ఎన్నికల కోసం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన రోజా భాస్కర్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు.  జాయింట్ కలెక్టర్ సమక్షంలో విమర్శలు చేసుకున్నారు. పార్టీ హైకమాండ్ దీపను ఎంపీగా ఎన్నిక చేసుకోమన్నారని రోజా చెప్పినా భాస్కర్ రెడ్డి వర్గం వినలేదు. దాంతో వారి ఓటింగ్‌ను రోజా అడ్డుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram