YSRCP Jammalamadugu MLA Sudheer Babu Attacked | జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై దాడి | ABP Desam
కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ ప్రశాంతంగా ముగుస్తున్న సమయంలో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పట్టణ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో పోలింగ్ బూత్ 116, 117 లో బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తలకు తీవ్ర గాయం అయినట్లు సమాచారం. మరోవైపు బీజేపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి వాహన అద్దాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. జమ్మలమడుగు టీడీపీ ఆఫీస్ వద్దకు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఆదినారాయణ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని పలువురు ముఖ్య నేతలను దేవగుడి గ్రామానికి తరలించారు పోలీసులు.