Ys Vivekananda Birth Anniversary | వైఎస్ వివేకాకు సునీత నివాళులు..మరీ జగన్ సంగతేంటీ..?

మంగళవారం నాడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 72వ జయంతి. ఈ సందర్భంగా వైఎస్ సునిత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి వివేకాకు నివాళులు అర్పించారు. ఈ కేసుపై సీబీఐ విచారణం చేస్తుందని..మనం జ్యోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సునీత అన్నారు. ఐతే..వైఎస్ వివేకా జయంతిని అబ్బాయిలు జగన్, అవినాష్ మరిచిపోయారా లేదా కావాలనే మరిచినట్లు నటిస్తున్నారా అన్న ఆరోపణలు టీడీపీ చేస్తోంది. ఈ అబ్బాయిలకు జయంతి గుర్తుండదు కానీ వర్ధంతి డేట్ మాత్రం గుర్తుంటుందని నారా లోకేశ్ విమర్శించారు. వేటు వేసిన చేతుల‌తోనే బాబాయ్ జ‌యంతికి ట్వీటు వేస్తే బాగోద‌నేమో వేయ‌లేదని లోకేశ్ సెటైర్లు వేశారు. అబ్బాయిల వేధింపులు-కుతంత్రాల‌కి ఎదురొడ్డి సోద‌రి సునీత గారు చేస్తున్న న్యాయ‌పోరాటంలో త‌ప్ప‌క గెలుస్తారని నారా లోకేశ్ ట్వీట్ వేశారు. నారా లోకేశ్ ట్వీట్ ను జత చేస్తూ... వివేకా విషయంలో తప్పు చేయకుంటే అబ్బాయిలిద్దరు జయంతి శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola