YS Sharmila To Lose in Loksabha Elections | లోక్‌సభ ఎన్నికల్లో షర్మిల ఓడనున్నారా?
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగియటంతో ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. సీ ఓటర్ తో ఏబీపీ విడుదల చేస్తున్న ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణ కోసం వీడియో చూడండి.
కడప లోక్ సభ నియోజకవర్గంలో షర్మిల కూడా గట్టి పోటీ ఇచ్చారు. ఆమెకు ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో భారీగా ఓట్లు పోలయ్యాయని ఎగ్జిట్ పోల్ అంచనాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. షర్మిల గెలవలేకపోవచ్చు కానీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా నష్టం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. షర్మిల దూకుడుగా చేసిన రాజకీయాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ 3.3 శాతానికి చేరుకుంటుందని స్పష్టమయింది. గత ఎన్నికల్లో ఇది ఒక్క శాతం కూడా లేదు. కాంగ్రెస్‌కు పెరిగిన ప్రతి ఒక్క ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అవుతుంది. ఎందుకంటే వైసీపీ ఓటు బ్యాంక్ మొత్తం కాంగ్రెస్ పార్టీదే. దళితులు, ముస్లింలు , గిరిజనుల్లో ఈ సారి కొంత కాంగ్రెస్ వైపు మళ్లినట్లుగా కనిపిస్తోంది.