YS Sharmila Son Marriage : షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లిలో ఈ విషయాలను గమనించారా..?

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం, అట్లూరి ప్రియతో... రాజస్థాన్ లోని జోధ్ పూర్ ప్యాలెస్ లో క్రిస్టియన్ పద్ధతుల ప్రకారం ఘనంగా జరిగింది. తన ఆనందాన్ని ఓ వీడియో ద్వారా వైఎస్ షర్మిల ట్విట్టర్ లో పంచుకున్నారు. పెళ్లి వీడియో చూసిన చాలా మంది సోషల్ మీడియా యూజర్లలో ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే, పెళ్లి జరిపించిన వ్యక్తి గురించి. ఎవరో ఓ విదేశీయుడు రాజారెడ్డి-ప్రియ పెళ్లిని అఫీషియేట్ చేశారు. షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఉండగా, వేరే ఎవరి చేతో ఎందుకు పెళ్లి జరిపించారో, వాళ్ల పద్ధతులేంటో అంటూ సోషల్ మీడియాలో కొందరు తమ డౌట్ ను, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola