YS Sharmila Protest in Delhi : ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం షర్మిల ఆందోళన | ABP Desam
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దిల్లీలో దీక్ష చేపట్టారు. ఏపీ భవన్‌లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి దీక్ష చేశారు.ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కొనసాగిస్తామన్నారు. తిరుపతిలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ మాట చెప్పారు. విభజన చట్టంలోని హామీలను ఎందుకు ఇప్పటికీ నెరవేర్చలేదని షర్మిల ప్రశ్నించారు.