YS Sharmila on Phone Tapping Issue | ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించిన షర్మిల
తెలుగు రాష్ట్రాలో ఫోన్ ట్యాపింగ్ అంశం పెను దుమారం రేపుతోంది. ఏపీకి చెందిన కీలక నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వారిలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పేరు కూడా వినిపిస్తుంది. ఈ ఆరోపణలపై షర్మిల స్పందించారు. జగన్, వైవీ సుబ్బారెడ్డిపై APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేసారు. జగన్ తీరు అలీబాబా 40 దొంగల సమేత లాగానే ఉందని అన్నారు. దొంగ ఎక్కడైనా దొంగ అని ఒప్పుకుంటాడా ? అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల. వైవీ సుబ్బారెడ్డి దగ్గర ట్యాప్ అయిన నా ఆడియో ఉందని అన్నారు. ఇది నిజమో కాదో.. వైవీ సుబ్బారెడ్డి తన కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి నిజం చెప్పాలి అంటూ సుబ్బారెడ్డికి సవాలు విసిరారు వైఎస్ షర్మిల. వైవీ చేతికి ఆ ఆడియో ఎలా వచ్చింది ? అని ప్రశ్నించారు. ఎవరైనా ఇస్తే వచ్చిందే కదా.. వైవీ నీ విచారణకు పిలవాలి. ట్యాపింగ్ లో నిజాలు నిగ్గు తేలాలి అంటూ చెప్పుకొచ్చారు వైఎస్ షర్మిల.